కొండ సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం లేని వారు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం మానుకోవాలి మా సీఎం, మా ఎమ్మెల్యేకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి,మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో ఒక ఎమ్మెల్యేకు గాని అతని వయసుకు గాని మర్యాద ఇవ్వకుండా మాట్లాడవ్ నువ్వు ఒక మహిళవేనా గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు టిపిసిసి మాజీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య గారు పత్రికా మీడియా మిత్రులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మొన్న పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరకాల అభివృద్ధిని చూసి మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని కోరడాన్ని సుస్మిత విమర్శించడం ఏంటో అర్థం కావడం లేదు.మాజీ ఎమ్మెల్యే శ్రీ చల్ల ధర్మారెడ్డికి భయపడి పరకాల నుంచి దూరంగా వెళ్ళిన కుటుంబం మీది అన్నారు.నీకు సందర్భం లేని విషయాలలో తలదూర్చి ఏదో తోచింది మాట్లాడి మంత్రి కొండ సురేఖ గారికి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది నువ్వే అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని చెప్పారు.పరకాల మాది మాది అంటున్నావ్ నువ్వు పరకాలకు చేసింది ఏంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గర్ల పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వారికి మరియు పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్పిటిసి&డిసిసి ప్రధాన కార్యదర్శి పాడి కల్పనా దేవి గారు మాట్లాడుతూ...పరకాల గడ్డ ఎవరి అడ్డా కాదు... పరకాల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా..."అని కొనియాడారు. 2012 సంవత్సరం నుంచి మీరు పరకాలకు దూరమయ్యారన్నారు అలాంటి కుటుంబం నుంచి వచ్చి పరకాల గడ్డ నాది అనడం విడ్డూరంగా ఉంది అని అన్నారు నీకు రాజకీయంగా ఎదగాలని ఉంటే నీ భాషను నీ వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఎదగాలన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గాని మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని గాని విమర్షిస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. నాగారం మాజీ సర్పంచి&డిసిసి సెక్రెటరీ కట్కూరి స్రవంతి గారు మాట్లాడుతూ...* గౌరవ సీఎం గారితో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు.గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలను మీ అమ్మ కొండ సురేఖ వల్ల క్షమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.కానీ మళ్ళీ మా నాయకులను విమర్శించడం నీకు తగదన్నారు.అసలు సుస్మిత పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి మాజీ జనరల్ సెక్రెటరీ భీమగాని సౌజన్య,డీసీసి ప్రధాన కార్యదర్శి పాడి కల్పనాదేవి,డిసిసి కార్యదర్శి కట్కూరి స్రవంతి,మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య,కౌన్సిలర్లు పోరండ్ల మౌనిక,బొచ్చు సుభద్ర,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,డైరీ ఫాం ప్రెసిడెంట్ కచ్చకాయల అరుణ,వైస్ ప్రెసిడెంట్ మోరె కవిత,మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రావు, లక్కం వసంత,దాసరి పద్మ,కవిత ఎండి రహేమా,అడప రమ తదితరులు పాల్గొన్నారు
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
