ప్రధాన మురికి కాలువ లో చెత్త వేస్తే జరిమానా.
కమిషనర్ గోపు గంగాధర్ హెచ్చరిక..
ప్రజలు ఇండ్లలో ని దుకాణంలో ని చెత్తను డ్రైనేజీల్లో వెయ్యకుండా సిబ్బంది ప్రత్యేక తనిఖీలు..
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం లో అధికారుల కు ప్రజలు సహకరించాలి..
కామారెడ్డి / బాన్సువాడ :బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ప్రధాన మురికి కాలువ లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని బుధవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ వ్యాపారస్తులకు, నివాసం గృహాల్లో ఉండే యజమాను లకు హెచ్చరించారు. బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో గల ప్రధాన మురికి కాలువలో చెత్త, వ్యర్థాలు వేయడం వల్ల కాలువల్లో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రజలు, వ్యాపారులు కాలువల్లో చెత్తచెదారం వేయ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి నిబంధనల ప్రకారం జరిమానా విధించడంతో పాటు, పునరావృతంగా ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందు కు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రజలు తమ ఇళ్లలోని, దుకాణాల్లో ని చెత్తను కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బంది కి అప్పగించాలని, పరిసరాలను పరిశుభ్రం గా ఉంచడం లో అధికారుల కు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
