నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి
నాగర్ కర్నూల్ :ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అవసరం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు, ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనీ , నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అవసరం ఉందన్న కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా చర్యలు చేపట్టాలనీ అధికారులు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ సమీక్ష
నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని భారత ఎన్నికల సంఘం నాగర్‌కర్నూల్ జిల్లాకు నియమించిన జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాను సందర్శించిన జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాల పరిశీలన, క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న సమాచారం, ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లు తదితర అంశాలపై పరిశీలకుడు రాజకీయ పార్టీల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పరిశీలకుడికి వివరించారు. జిల్లాలోని సంబంధిత నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా పరిశీలన, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం తదితర అంశాలను పరిశీలకుడికి వివరించారు. ఈ సందర్భంగా కే. సురేంద్రమోహన్ మాట్లాడుతూ...ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అర్హులైన ప్రతి ఓటరుకు హక్కు కల్పించే విధంగా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలకు ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ఎన్నికల యంత్రాంగం ప్రధాన బాధ్యత అని పరిశీలకుడు తెలిపారు. ఓటర్ జాబితాలో తమ పేరు నమోదై ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు కుటుంబాలను గుర్తించి, ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, వారి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో చెంచు గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సహకారం అందించాలని కోరారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, వారు ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారి నివాస ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉండే ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి, సంబంధిత ఆధారాలను పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కే. సురేంద్రమోహన్ సూచించారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరుకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో కొనసాగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ...., ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, ప్రతి దశలోనూ అవసరమైన పర్యవేక్షణ చేపడుతున్నామని, ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు ఓటర్ జాబితా సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాలను ఓటర్ జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సవరణలు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తులను సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ జాబితా సవరణల ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సైతం ఓటర్ జాబితా సవరణలు, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సూచనలు, అభ్యంతరాలను అధికారులకు అందించాలని కోరారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి వచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, ఓటర్ జాబితా సవరణలు, దరఖాస్తుల స్వీకరణ, ఓటర్ల నమోదు ప్రక్రియపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు, బూత్ స్థాయి అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు స్పష్టమైన అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా సమన్వయంతో పనిచేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి చెన్నయ్య, ఆర్డీవోలు, బన్సీలాల్, అర్చన, యాదగిరి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బాలకృష్ణ, హబీబ్, రాజేందర్, ఎండి హుస్సేన్, నరసింహ విష్ణు, నాగేందర్ గౌడ్, రామకృష్ణ ఎన్నికల సూపరిండెంట్ రవికుమార్, డిటి కల్పన తదితరులు పాల్గొన్నారు.హక్కు అందేలా చర్యలు చేపట్టాలి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ సమీక్ష, నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని భారత ఎన్నికల సంఘం నాగర్‌కర్నూల్ జిల్లాకు నియమించిన జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాను సందర్శించిన జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాల పరిశీలన, క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న సమాచారం, ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లు తదితర అంశాలపై పరిశీలకుడు రాజకీయ పార్టీల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పరిశీలకుడికి వివరించారు. జిల్లాలోని సంబంధిత నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా పరిశీలన, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం తదితర అంశాలను పరిశీలకుడికి వివరించారు. ఈ సందర్భంగా కే. సురేంద్రమోహన్ మాట్లాడుతూ...., ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అర్హులైన ప్రతి ఓటరుకు హక్కు కల్పించే విధంగా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలకు ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ఎన్నికల యంత్రాంగం ప్రధాన బాధ్యత అని పరిశీలకుడు తెలిపారు.
ఓటర్ జాబితాలో తమ పేరు నమోదై ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు కుటుంబాలను గుర్తించి, ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, వారి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో చెంచు గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సహకారం అందించాలని కోరారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, వారు ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారి నివాస ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉండే ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి, సంబంధిత ఆధారాలను పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కే. సురేంద్రమోహన్ సూచించారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరుకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో కొనసాగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ...., ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, ప్రతి దశలోనూ అవసరమైన పర్యవేక్షణ చేపడుతున్నామని, ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు ఓటర్ జాబితా సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాలను ఓటర్ జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సవరణలు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ జాబితా సవరణల ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సైతం ఓటర్ జాబితా సవరణలు, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సూచనలు, అభ్యంతరాలను అధికారులకు అందించాలని కోరారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి వచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలోని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, ఓటర్ జాబితా సవరణలు, దరఖాస్తుల స్వీకరణ, ఓటర్ల నమోదు ప్రక్రియపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు కోరారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు, బూత్ స్థాయి అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు స్పష్టమైన అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా సమన్వయంతో పనిచేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి చెన్నయ్య, ఆర్డీవోలు, బన్సీలాల్, అర్చన, యాదగిరి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బాలకృష్ణ, హబీబ్, రాజేందర్, ఎండి హుస్సేన్, నరసింహ విష్ణు, నాగేందర్ గౌడ్, రామకృష్ణ ఎన్నికల సూపరిండెంట్ రవికుమార్, డిటి కల్పన తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
