దేశ దేశాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివి
దేశ దేశాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివి : పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ : నిజామాబాద్ గురువారం నగరంలోని వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలను, యువత, సాంకేతిక రంగం, స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఆయన దూరదృష్టిని టీ పీసీసీ చీఫ్ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి నుడా చైర్మన్ కేశ వేణు ,డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు తహిర్ బిన్ హమ్ దాన్, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డి, కార్పొరేటర్ మనోహర్, ఎర్రం గంగాధర్, పుప్పాల రవి, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు
అర్పించడం జరిగింది.
అర్పించడం జరిగింది. Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
