నేడే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

నేడే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

  • విజయవంతం చేయండి: బేగరి రాజు
  • తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేల సభ

షాబాద్, (రంగారెడ్డి): నేడు హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బేగరి రాజు అన్నారు.బుధవారం షాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా, తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ షాబాద్ మండల ఇన్చార్జ్ నవీన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి బేగరి రాజు, తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు ముస్తఫా మాట్లాడుతూ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా మహా యజ్ఞాని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంకురార్పణ చేయబోతున్నారని తెలిపారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణ పునర్నిర్మాణం కర్తవ్యాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు సబ్బండ వర్గాల వికాసం... సాధికారతే లక్ష్యంగా గురువారం రోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆచార్య జయంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర నలుమూలల నుండి అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మున్సిపాలి అధ్యక్షులు ఎండి అన్వార్ ఖాన్ , తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల మేకగూడెం బిక్షపతి, టిఆర్ఎస్ నాయకులు మలని రాజు, యండి యూనిస్, సయ్యద్ యాహియా పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు