పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు
ఆరుగురిపై కేసు నమోదు..
₹9 వేల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం
పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: టాస్క్‌ఫోర్స్ సీఐ నటేష్
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ పరిధిలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ కార్ వాషింగ్ సెంటర్ వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్రమంగా డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ అనిల్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹9,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ నటేష్ తెలిపారు. నిందితుల వివరాలు వొల్లాల రమేష్, వయస్సు 47 సంవత్సరాలు, సర్దార్‌నగర్, సిరిసిల్ల. పెరాల కరుణాకర్ రావు, తండ్రి గోపాల్ రావు, వయస్సు 52 సంవత్సరాలు, హుజురాబాద్. నమిలికొండ నర్సయ్య, వయస్సు 41 సంవత్సరాలు, పోతిరెడ్డిపల్లి గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలం. ముత్యాల అఖిల్, వయస్సు 34 సంవత్సరాలు, కోరుట్ల బస్టాండ్ సమీపం, వేములవాడ. మెరుగు లక్ష్మణ్, వయస్సు 48 సంవత్సరాలు, పల్లె నిజామాబాద్, కోనరావుపేట మండలం. గుండా సంతోష్, వయస్సు 43 సంవత్సరాలు, వెంకంపేట, సిరిసిల్ల. జిల్లాలో ఎక్కడైనా పేకాట, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, వాటికి స్థావరాలు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ సీఐ నటేష్ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిస్తే పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
