ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలతో సమాజాభివృద్ధికి కృషి చేయాలి
-'నషా ముక్తి భారత్' పోస్టర్ ఆవిష్కరణ
-వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు
-అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు
పెద్దపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పిలుపునిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నషా ముక్తి భారత్' (డ్రగ్స్ రహిత భారత్) పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసి నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం 'నషా ముక్తి భారత్' కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, వ్యసన రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బందితో కలిసి నషా ముక్తి భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, సీపీఓ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
