యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు
- ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
- సీపీఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆగ్రహం
కరీంనగర్,: దేశంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎంకరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అత్యధిక యువశక్తి కలిగిన దేశంలో యువత శక్తిని వినియోగించుకోవాలనే సోయి పాలకవర్గాలకు లేదని, నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని, కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో 10 లక్షలకు పైగా పోస్టులుఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ప్రశ్నించే యువకులకు సమాధానం చెప్పాల్సింది పోయి పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగమేఅని భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని, ప్రధాని నుంచి పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు వరకు ఇదే ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు భర్తీ చేయాలని, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, గ్రూపు-1,2,3,4 తదితర అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 5 వేల రూపాయల భృతి ఇవ్వాలని, ఉద్యోగ క్యాలెండర్, యువత ప్రకటన, రాజీవ్ యువ వికాస పథకాలను అమలు చేయాలని, కరీంనగర్ జిల్లాలో కొత్త సమాచార సాంకేతిక కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి స్వామికివినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జి. బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, వెల్మారెడ్డి రాజిరెడ్డి నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
