అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా
రేషన్ బియ్యం అందించాలి: అదనపు కలెక్టర్
మహబూబ్ నగర్ : జడ్చర్ల పట్టణంలోని మదీనా కాలనీలో గల చౌక ధర దుకాణాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జడ్చర్ల తహశీల్దార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, డీటీతో కలిసి చౌక ధర దుకాణం నంబర్ 1423001 ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు, పంపిణీ ప్రక్రియ, రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలనిసూచించారు.లబ్ధిదారులకురేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. ఈ తనిఖీలో జడ్చర్ల తహశీల్దార్ నర్సింగరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, డీటీ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


