రాజీవ్ ఆలోచనలు యువతకు స్ఫూర్తి

రాజీవ్ ఆలోచనలు యువతకు స్ఫూర్తి

కరీంనగర్,  : ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకమనికాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుఅన్నారు.రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ రాజీవ్ చౌక్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించిప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన దార్శనికుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు.  యువతే దేశ భవిష్యత్తుఅన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డియువతకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు.21 ఏళ్లు నిండిన యువత ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించే అంశంపై త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడంలో రాజీవ్‌గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి, గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థలకు నిర్ణయాధికారం, నిధులు, అధికారాలుఅందించిన ఘనత ఆయనదేనన్నారు. గ్రామ స్వరాజ్యానికి బలమైన పునాదులు వేసిన నాయకుడిగా రాజీవ్‌గాంధీ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశ ప్రధానిగాసాంకేతికత, యువత, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చిన రాజీవ్‌గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువతలో ఆయన ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా నింపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారుఈ కార్యక్రమంలో ఆకారపు భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు,మహిళా నాయకులు,కార్యకర్తలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News