ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు.. దోమలతో ఇబ్బందులు
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని 4వ వార్డు శివాజీ కాలనీలో గాండ్ల సాంబయ్యకు చెందిన ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో దోమలు, ఇతర కీటకాలు పెరిగి, చుట్టుపక్కల నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంటి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయాలని పలుమార్లు కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొన్నారు. ఇటి యజమాను గాండ్ల సాంబయ్య వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, దోమల బెడద నుంచి తమను కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
