సీఎం రేవంత్ రెడ్డికి పతనం మొదలైంది
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూలు : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని,దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పతనం మొదలైందని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పునరుద్ధరణ కోసం భారీ నిరసన మహాధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఒక్క పిలుపుతో పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల వివాహాలకు అండగా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమన్నారు. పథకాలను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
