Category
HANMAKONDA
Telangana  HANMAKONDA 

బతుకమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వానం 

బతుకమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వానం    హన్మకొండ న్యూస్ :  వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ని శుక్రవారం హన్మకొండలోని ఆయన కార్యాలయంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సాగరిక రమాకాంత్ రెడ్డి లు  మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ, రావణ వధ ఉత్సవాలకు ఆహ్వానించారు.కాజీపేటలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వాన పత్రిక అందజేసి కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana  HANMAKONDA 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతృత్వంలో  బతుకమ్మ వేడుకలు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతృత్వంలో  బతుకమ్మ వేడుకలు హన్మకొండ న్యూస్ :   బతుకమ్మ సంబురాలు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం అంగరంగ వైభవంగా  జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మహిళా ఉద్యోగినిలు పెద్ద సంఖ్యలో హాజరై తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో  సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభోపీతంగా,మహిళల బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎన్పీడీసీఎల్ సిఎమ్ డి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి(రెవెన్యూ), శేషాద్రి( స్థానిక సంస్థలు), ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి హాజరైనారు. మహిళా ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి బతుకమ్మ ఆటపాటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా  వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ* బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ వవిశిష్టమైన సాంస్కృతిక వారసత్వంను భావితరాలకు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యంత వైభవంగా హనుమకొండ కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నరని పేర్కొంటూ జిల్లాలోని అధికారులకు, ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు.అన్నీ బతుకమ్మ లు చాలా బాగున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలోని  ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్పీడీసీఎల్ సిఎమ్ డి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ  జిల్లా  లోని అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళా శక్తికి ఆత్మగౌరవానికి ప్రతీక  బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, అధికారులు ,ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ సాంప్రదాయం తెలిపే పండుగలను ఉద్యోగ సంఘాల నేతృత్వంలో జరుపుకోవడం అత్యంత ఆనందకరం అని పేర్కొంటూ కలెక్టర్  నేతృత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే విధంగా బతుకమ్మ పండుగ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అత్యంత  తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు కలెక్టర్  చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.డిఆర్డిఏ  మొదటి బహుమతి, ,రెండవ బహుమతి ఐ సి డి ఎస్, మూడవ బహుమతి కలెక్టరేట్ రెవెన్యూ, స్పెషల్ ప్రైజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ లకు లభించాయి. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాస్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, సి పి ఓ సత్యనారాయణ రెడ్డి ,ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్,పనికల రాజేష్,జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, శ్యాంసుందర్ ,మాధవరెడ్డి, రాము నాయక్,శ్రీనివాస్ రెడ్డి, జయంతి,శ్రీలత, నాగరాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana  HANMAKONDA 

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం   హన్మకొండ న్యూస్ :     హనుమకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.   రాష్ట్ర అధ్యక్షుడు అన్నోజి వీరన్న,హనుమకొండ, వరంగల్ జిల్లాల  అధ్యక్షులు రవి ,రాజు   డిమాండ్ చేశారు. 'తెలంగాణ సాంస్కృతిక సారధి' సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించి, కళాకారులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకంచేసి రానున్న రోజుల్లో మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో సంస్కృతిక సారధిలో ఉద్యోగాలు రాని నిరుద్యోగ కళాకారులకు 2వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జ కట్టి గొంగడేసి ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాలను చేపట్టామని.. అలాంటి కళాకారులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో సంస్కృతిక సారధిలో కొంతమందికే ఉద్యోగ అవకాశాలు కల్పించారాణి వాపోయారు.
Read More...
Telangana  HANMAKONDA 

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య  హన్మకొండ న్యూస్ :   హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యశాలల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ అప్పయ్య తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా పలు ఆసుపత్రులను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, 2010 మరియు సంబంధిత నిబంధనలు, 2012 ప్రకారం ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్య సేవలు, అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు, రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాల్సిన కింది అంశాలను అధికారులు తనిఖీ చేశారు.. వైద్య సేవలకు సంబంధించిన టారిఫ్ జాబితా (చికిత్స రుసుముల వివరాలు) ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలి.2. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల పేర్లు, అర్హతలు, విధుల వివరాలతో కూడిన వైద్యుల జాబితాను ప్రదర్శించాలి. 3. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ( ఎస్ టి పి )కు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన అనుమతులను పరిశీలించారు. 4. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 5. కాలుష్య నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. 6. మున్సిపల్ శాఖ నుంచి పొందిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఒక్కపాన్సీ  సర్టిఫికెట్ ) తదితర అవసరమైన అనుమతులను తనిఖీ చేశారు. 7. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఇతర రిజిస్ట్రేషన్లు, అనుమతులు, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే సంబంధిత ఆసుపత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బృందాలు జిల్లాలోని ఆసుపత్రులను తనిఖీ చేసి, నిబంధనల అమలును పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాలు అవసరమైన అన్ని అనుమతులు, ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకొని అధికారుల తనిఖీలకు సహకరించాలని సూచించారు.
Read More...
Telangana  HANMAKONDA 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ ( ఈ హెచ్ ఎస్ ) పథకం అమలుకు థానా కమిటీ సభ్యుల అంగీకారం

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ ( ఈ హెచ్ ఎస్ ) పథకం అమలుకు థానా కమిటీ సభ్యుల అంగీకారం  హన్మకొండ  :   హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ( ఈ హెచ్ ఎస్ ) అమలు చేసేందుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించారు. గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్, ఐఏఎస్  సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేసేందుకు సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ పథకం అమలుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించడం సంతోషకరమని తెలిపారు. పథకం అమలుకు సంబంధించి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో థానా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాకేష్, ప్రదాన కార్యదర్శి డాక్టర్ రమేష్ సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి,  డాక్టర్ విజయ్, డాక్టర్ బి మోహన్ రావు అడిషనల్ డి ఎమ్  & హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana  Warangal  HANMAKONDA 

చండీ యాగంతో లోక కల్యాణం

చండీ యాగంతో లోక కల్యాణం స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జోస్యం వినయ్ శర్మ ఆధ్వర్యంలో సోమవారం చండీయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వినయ్ శర్మ మాట్లాడుతూ చండీ యాగం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. దుర్గాదేవిని మహాశక్తి స్వరూపిణిగా పూజిస్తూ నిర్వహించే చండీ యాగం ద్వారా లోకకల్యాణం, శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Read More...
Telangana  HANMAKONDA 

జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన అకిరానంద్..

జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన అకిరానంద్..   హన్మకొండ న్యూస్ : హనుమకొండ జిల్లాకు చెందిన శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ విద్యార్థి, బాల్ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు అకిరానంద్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. అక్టోబర్ 03/2026-07/2026 వరకు వరకు చత్తీస్గడ్ లోని బిలాస్ లో జరిగిన జాతీయ క్రీడోత్సవాలలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు .డబుల్స్ విభాగంలో తృతీయ స్థానం సాధించడంతో పాటు, జట్టు విభాగంలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోమవారం రోజు ఉదయం హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అకిరానంద్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. అకిరానంద్ సాధించిన విజయాలు పాఠశాలకు, జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.ఈ అభినందన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి రడం శ్రీనివాస్, పీఈటీ తిరుపతిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ ఇన్‌చార్జి భాస్కర్, అకిరానంద్ తండ్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana  HANMAKONDA 

ఇషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 

ఇషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్  ముఖ్యఅతిథిగా  పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి  హన్మకొండ న్యూస్ : హనుమకొండ నక్కల గుట్ట లోని వాటర్ ట్యాంక్ సమీపంలో గల బి కే రెడ్డి కాలనీలో గల వశిష్ట అపార్ట్మెంట్ లో ఇషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు ను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత...
Read More...
Telangana  HANMAKONDA 

డిజిటల్ నైపుణ్యాల వేడుక విజయవంతంగా నిర్వహన

డిజిటల్ నైపుణ్యాల వేడుక విజయవంతంగా నిర్వహన హన్మకొండ న్యూస్ :  మైక్రోసాఫ్ట్ మరియు ఎడ్యునెట్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన 'ఏఐ కెరీర్స్ ఫర్ విమెన్' (ఏఐసిడబ్ల్యు) చొరవ కింద, వరంగల్‌లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్  (సెంటర్ ఫర్ ఐ2ఆర్ఈ)ఆధ్వర్యంలో  ఏఐసిడబ్ల్యు 2.0 క్యాప్‌స్టోన్...
Read More...
Telangana  HANMAKONDA 

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సేవా కార్యక్రమం..

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సేవా కార్యక్రమం.. హన్మకొండ న్యూస్ : నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న *“సేవా సంకల్ప అభియాన్”*లో భాగంగా ఈరోజు హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు ప్రతి నెలా నిర్వహించే “దీనబంధు” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు, దివ్యాంగులకు భోజనం అందజేయడం...
Read More...
Telangana  HANMAKONDA 

ఆర్టీసీలో ఏఐటీయూసీ విజయం ఎర్రజెండాపై కార్మికుల నమ్మకానికి నిదర్శనం

ఆర్టీసీలో ఏఐటీయూసీ విజయం ఎర్రజెండాపై కార్మికుల నమ్మకానికి నిదర్శనం సిపిఐ జిల్లా కార్యాలయంలో విజయోత్సవ సంబురాలు హనుమకొండ  న్యూస్ : ​తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసి) గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్  రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.​ఈ విజయోత్సవ సందర్భాన్ని...
Read More...
Telangana  HANMAKONDA 

ఘనంగా గడ్డం కేశవమూర్తి జన్మదిన వేడుకలు

ఘనంగా గడ్డం కేశవమూర్తి జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం  హనుమకొండ: టీయూడబ్ల్యూజే ఐజేయు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి జన్మదిన వేడుకలను శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం...
Read More...