రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: బీజేపీ డిమాండ్

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: బీజేపీ డిమాండ్

​మల్యాల,  : జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు మాట్లాడారు. ​రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, విద్యార్థులే హంతకులుగా మారుతున్న దారుణ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ​పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో విద్యార్థులే నిందితులుగా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికరమని, విద్యాసంస్థల్లో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గల కారణాలను వెలుగులోకి తేవాలని కోరారు.​గతంలో నీట్ పరీక్ష అంశంపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ ధర్నాలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు రాష్ట్రంలో ఇంతటి దారుణం జరిగితే ఏ బాధ్యత తీసుకుంటా రని నిలదీశారు. కేంద్రానికి ఒక విధానం, రాష్ట్రానికి మరో విధానమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు వీడి, విద్యాసంస్థల్లో భద్రతను పటిష్టం చేయాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్ మరియు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
​ఈ  సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు గాజుల మల్లేశం, మాజీ ఎంపీటీసీ రవి, మ్యాదంపల్లి ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News