అధికార బలం.. అక్రమ రవాణా..!
మానేరు వాగును కాపాడండి బాబోయ్..
కరీంనగర్ : కరీంనగర్ నగర శివార్లలోని చింతకుంట పరిధిలో గల మానేరు వాగులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. మానేరు వాగులో జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పును రూ. 900 నుండి రూ. 1,000 వరకు విక్రయిస్తూ అక్రమార్కులు లక్షల రూపా యలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి దందా వెనుక స్థానిక కార్పొరేటర్‌కు చెందిన జేసీబీ వాహనం ప్రమేయం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే మట్టి మాఫియా బరితెగించి ప్రవర్తిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున సహజ సంపద దోపిడీకి గురవుతున్నా, సంబంధిత మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అధికారుల ఉదాసీనత వల్లే వాగులు గుల్లవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మానేరు వాగులో మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని మరియు బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
