తాండూరులో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు
తాండూరు, (వికారాబాద్) తాండూరులో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలనీలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ నీరాజ బాల్రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లొల బాల్రెడ్డి, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులో స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా అనేక సేవలు చేశారని కొన్ని ఆడారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ యువతకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు సాంకేతిక రంగానికి పెద్దపీట వేసి దేశ ప్రగతికి పునాది వేసిందని పేర్కొన్నారు. ప్రధానిగా దేశాభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి కృషి చేశారని కొన్ని ఆడారు. ఆయన చేసిన సేవలు దేశం ఎప్పటికీ మర్చిపోదని చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. యువత రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
