డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు

డంప్‌యార్డ్ ను వెంటనే తరలించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్

డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు

కరీంనగర్, : కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజ పడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని జనావాసాలకు దూరంగా డంప్‌యార్డ్ ను తరలించి, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి ఆధ్వర్యంలో సోమవారం డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, నగరంలో సంవత్స రాలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన, పొగ, దుమ్ము వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలుతలెత్తుతున్నాయన్నారు. కోతిరాంపూర్, లక్ష్మినగర్, కట్టరాంపూర్, కొత్త యాస్వడ, కమాన్ ప్రాంతం, బస్టాండ్, అంబేద్కర్ స్టేడియం తదితర ప్రాంతాల ప్రజలు పొగతో, దుమ్ముతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డ్ ను స్మార్ట్ డంపింగ్ యార్డ్ గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్, కరీంనగర్ మేయర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. స్మార్ట్ సిటీలో భాగంగా డంపింగ్ యార్డ్ ను ఆధునీకరిస్తామన్న నగర పాలక సంస్థ పాలకుల మాటలు బూటకమని తేలిపోయాయన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నగరానికి దూరంగా డంప్‌యార్డ్ ను తరలించి, బయోమైనింగ్ ద్వారా చెత్తను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా వార్డు స్థాయిలో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి జిల్లా ఆదివాసి విభాగం అధ్యక్షుడుకుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు
కరీంనగర్ లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్
గంభీరావుపేట లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ, జయంతి వేడుకలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్