పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన

 రాష్ట్రస్థాయి ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటన

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన

 చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు), ఫిష్ పాండ్స్ నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న మరో ఫామ్ పాండ్‌కు మార్కౌట్ చేశారు.ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీల నిర్మాణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, భూగర్భ జలాల పెంపునకు ఈ నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జ్యోతి, అడిషనల్ డీఆర్‌డీవో బాలరాజు, క్లస్టర్ ఏపీడీ మదలత, ఎంపీడీవో కె. శంకర్, గ్రామ సర్పంచ్ రేణుక బాలరాజు, ఎంపీవో సువర్ణ, ఏపీవో రామ్మోహన్, ఈసీ మహేశ్వర్ రెడ్డి, టీఏ రమేష్, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఉపసర్పంచ్, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
 
1001226715
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన
  చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం
మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు