లింగన్నపేట వాగుపై బస్సులు నడిచేలా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి

లింగన్నపేట వాగుపై బస్సులు నడిచేలా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి

 రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై  బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో  డిగ్రీ విద్యార్థుల తో కలిసి గురువారంరోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్  వెంటనే స్పందించి లింగన్నపేట మట్టి రోడ్డు పనులు పూర్తిచేసి బస్సుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడుకోడె రమేష్ మాట్లాడుతూ, గంభీరావుపేట మరియు లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ వంతెన  పనులను పూర్తిచేయాలని  కోరారు. . మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు విద్యార్థులు బస్సుల ద్వారా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చుట్టూ తిరిగి రావాలంటే 20 కిలోమీటర్ల దూరం పడుతుందని విద్యార్థులు సమయానికి స్కూలుకు కాలేజీలకు రాలేకపోతున్నారని, ప్రస్తుతం వెంటనే మట్టి రోడ్డు నిర్మించాలని అలాగే బస్సులు వచ్చే విధంగా చూడాలని కోరారు. ధర్నా చేస్తున్న బిజెపి నాయకులు విద్యార్థుల వద్దకు తాసిల్దార్ మారుతి రెడ్డి మరియు ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ వచ్చి నాయకులకు విద్యార్థులకు సర్ది చెప్పి వారం పది రోజులలో తాత్కాలిక మట్టిరోడు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా బిజెపిఅధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి తొట్ల మల్లేష్ యాదవ్, తిరుపతి, ఎక్కల దేవి చంద్రం యాదవ్, కొక్కు దేవేందర్ యాదవ్, రాజేష్ చారి తోపాటు డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!! అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!
సిద్దిపేట  (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య  అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
లింగన్నపేట వాగుపై బస్సులు నడిచేలా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి
పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ అనురాధ
బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ
గంభీరావుపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్‌.
ఉప సర్పంచ్ రఫీక్ ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు