సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
మండల వ్యవసాయ అధికారి
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల సన్న వరి విత్తనాలు తీసుకున్న రైతుల సంబంధిత విత్తనాలు కొనుగోలు చేసిన విత్తన దుకాణాల్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.రైతు సోదరులు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్, విత్తన కొనుగోలు చేసిన రశీదు తీసుకొని సంబంధిత విత్తన దుకాణం లో సంప్రదించాలన్నారు.కౌలు రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.అలా చేస్తే కౌలు రైతులకు బోనస్ నేరుగా కౌలు రైతుల అకౌంట్ లో జమ అవుతుందన్నారు.రైతులు విత్తన దుకాణాల్లో కాకుండా ప్లాంట్,రైతు దగ్గర విత్తనం తీసుకొని విత్తుకున్న రైతులు గ్రామ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
