గ్రామపంచాయతీ సిబ్బంది రిలే నిరాహార దీక్ష
*కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి.
*కార్మికుడు చనిపోతే దహన సంస్కారాలకు 30 వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి.
*ఇందిరమ్మ ఇండ్లు గ్రామపంచాయతీ కార్మికులకు కేటాయించాలి.
కొమురవెల్లి ( సిద్దిపేట ):కొమురవెల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర మండలంలోని గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి దానితోపాటుగా కనీస వేతనం 26 వేల రూపాయలు గా నిర్ణయించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేసి కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి వయసు పైబడిన , కార్మికుడు మరణించిన స్థానంలో కుటుంబ సభ్యుల నుండి ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోవాలి. అక్రమంగా విధుల నుండి తొలగిస్తున్న సర్పంచ్ లపై కఠిన చర్యలు తీసుకొని, గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని, కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని గ్రామపంచాయతీల సిబ్బంది కోరారు. ఈ రిలే నిరాహార దీక్షలో మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ దగ్గర గ్రామపంచాయతీ ల సిబ్బంది పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
