గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత

వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత

కొత్తగూడెం : రామవరం–కొత్తగూడెం ప్రధాన రహదారిలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నిర్మించిన బ్రిడ్జిపై వరుసగా గుంతలు ఏర్పడుతుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రిడ్జికి ఒక వైపున గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. తాజాగా మరో వైపున కూడా భారీ గుంత ఏర్పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ప్రధాన రహదారిపై గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ , టూ టౌన్ ఎస్‌ ఐ రాజశేఖర్ గుంత ఏర్పడిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేశారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగిస్తున్నారు. ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపైనే తరచూ గుంతలు ఏర్పడుతుండటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి గుంతలు ఏర్పడకుండా నాణ్యమైన మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.1001569225
Views: 133

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News