ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, డా.ఆర్.భూపతి రెడ్డి
నిజామాబాద్ : ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం గురువారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ అభివృద్ధికి అనుసంధానం చేసిన దూరదృష్టిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడతూ…
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో సాంకేతిక, సమాచార రంగాల అభివృద్ధికి పునాదులు వేశారని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, కమిటీ సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
