ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి వేడుకలు
కరీంనగర్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని మదీనా చౌరస్తా, మాంగల్య షాపింగ్ మాల్ సమీపంలో గల ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,బిజెపి నాయకులు,వివిధ సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆచార్య జయశంకర్ గారికి శ్రద్ధాంజలి ఘటించారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
