పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ అనురాధ

పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ అనురాధ

చౌటకూర్,  : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని ఎంఈఓ అనురాధ పరిశీలించారు. స్థానికంగా యూనిఫాంలు కుడుతున్న ఏజెన్సీలను సందర్శించిన ఆమె, కుట్టు ప్రక్రియను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.విద్యార్థులకు అందించే దుస్తులు పూర్తి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. సరైన కొలతలు, వస్త్ర నాణ్యత పాటించడంతో పాటు కుట్టు పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత సమయంలోగా యూనిఫాం కుట్టు పనులను పూర్తి చేసి అందజేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు ఈ సందర్భంగా ఎంఈఓకు తెలిపారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!! అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!
సిద్దిపేట  (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య  అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
లింగన్నపేట వాగుపై బస్సులు నడిచేలా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి
పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ అనురాధ
బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ
గంభీరావుపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్‌.
ఉప సర్పంచ్ రఫీక్ ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు