అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని ఎంఈఓ కు వినతి

అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని ఎంఈఓ కు వినతి

 

నాంపల్లి,:మండలంలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉందని, వెంటనే అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని మండల విద్యాధికారి అజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మేరకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచడం విద్యాశాఖ బాధ్యతని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చిట్టెంపహాడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని అయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొలగోని శ్రీకాంత్, సుంకరి శంకర్, మరేపాకుల శివ, నాంపల్లి శంకర్, నాంపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News