డీ-8 కెనాల్‌ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి,

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదలపై ఆరా

డీ-8 కెనాల్‌ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి,

  • ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి, నీటిని వృథా చేయొద్దు
  • కాల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి*

నాగర్ కర్నూల్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ , కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, సాగునీటిపారుదల‌ శాఖ అధికారులు, తదిత‌రులు ఉన్నారు. 
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కొండ సుష్మిత  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం కొండ సుష్మిత  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు  నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం
డీ-8 కెనాల్‌ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి,
రెండోసారి ఏఐవైఫ్ జిల్లా అధ్యక్షుడిగా జనగాం రాజ్ కుమార్ ఎన్నిక
యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు
సీఎం రేవంత్ రెడ్డికి పతనం మొదలైంది
దేశ దేశాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివి