శ్రీ సంజీవని ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

శ్రీ సంజీవని ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

మహబూబ్‌నగర్‌లోని శ్రీ సంజీవని ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రక్తదాతలు విశేషంగా స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాల శ్రీనివాస్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజా ఆరోగ్యానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.శ్రీ సంజీవని ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ద్వారా సేవాభావం, సామాజిక బాధ్యతను చాటిచెప్పినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
Views: 76

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News