దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు:  ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుదవారం చిల్పూరు మండల కేంద్రంలో  33లక్షల 60వేల అభివృద్ధి పనులు, నూతనంగా నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం చిల్పూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్పూరు మండల కేంద్రంలోనే మండల కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రెండున్నర ఏళ్లలో చిల్పూరులో 2కోట్ల 72లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, 2వివో భవనాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఆతి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మంజూరు కాబోతుందని తెలిపారు. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు  గ్రామ గ్రామాన అభివృద్ధి పనులు చేయడమే నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా సన్న బియ్యం పంపిణి చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల 800కోట్ల ఖర్చుతో కోటి 06లక్షల రేషన్ కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఒక్కరికి 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి చెస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేస్తుందని అన్నారు. ఈ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ వాళ్ళు అంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం పంపిణి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో చేపట్టే కార్యక్రమానికి మోడీ ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, సీనియర్ నేత అక్కినెపల్లి బాలరాజు, తహసీల్దార్, సర్పంచులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు:  ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ
గ్రామపంచాయతీ సిబ్బంది రిలే నిరాహార దీక్ష
నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించండి
ప్రధాన మురికి కాలువ లో చెత్త వేస్తే జరిమానా.
పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు