కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి. 

8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సాయప్ప, మాజీ కౌన్సిలర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు. 

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి. 

 

 

తాండూరు (వికారాబాద్ జిల్లా) కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మంటూ చెప్పుకుంటూ కనీసం ఎలాంటి ఓటు హక్కు కూడా లేని ఇందిమ్మ కాలనీ కి చెందిన నాసర్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తు పార్టీలో అనవసరంగా గొడవలు సృష్టిస్తున్న నాసార్ పై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుని పార్టీ నుండి బహిష్కరించాలని వార్డు ఇన్చార్జి సాయప్ప మరియు మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ స్థానిక మహిళ నాయకులు పలువురు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గత, ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని, ప్రస్తుతం తాండ్ర పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆదేశాలతో చేపడుతున్న స్థానిక వార్డు కమిటీ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఒకే వార్డులో రెండు కమిటీలు చేపట్టాలని రాద్ధాంతం చేస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపై అనవసరపు ఆరోపణలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. నాసర్ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ అధిష్టానానికి స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. వెంటనే నాసర్ ను సస్పెండ్ చేసి పార్టీ నుండి బహిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి కోరారు. 
 
 
Views: 63

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News