బాలికలు ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన దిశగా
విద్యలో రాణించాలి - కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్, : నాగనూల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.పాఠశాలలో విద్యార్థినుల హాజరు, విద్యాబోధన తీరు, పరిశుభ్రత, వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో మొత్తం 317 మంది విద్యార్థినులు నమోదై ఉండగా, గురువారం కేవలం 229 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు.100 శాతం విద్యార్థినుల హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని కలెక్టర్ ఆదేశించారు.తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థినులను గుర్తించి, గైర్హాజరుకు గల కారణాలు తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థినులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. ఆరోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.తరగతి గదులు, చదువుకునే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో సరుకుల నిల్వ, స్టాక్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు.స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్ లో లీకేజీని గుర్తించిన కలెక్టర్,వెంటనే మరమ్మతులు చేపట్టాలని, తాగునీటి విషయంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.అనంతరం వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, భోజన నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.10వ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ ముచ్చటించారు. వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. పదో తరగతి పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, ప్రతిరోజూ పాఠాలను పునశ్చరణ చేసుకోవాలని, అర్థంకాని అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాధించాలని ప్రోత్సహించారు. ప్రతి విద్యార్థినిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు.కేజీబీవీలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణ పనుల వల్ల విద్యాభ్యాసానికి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ ఏ.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
