₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్.
పెన్సిల్ వ్యాపారం పేరుతో సైబర్ మోసం
బిచ్కుంద, : బిచ్కుంద మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. “పెన్సిల్ వ్యాపారం చేసుకోండి.. కేవలం ₹650 చెల్లిస్తే ఐడీ కార్డు, ముడిసరుకు పంపిస్తాం.. మీకు ₹15,000 అడ్వాన్స్ ఇస్తాం” అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఫోన్‌లో ఆకర్షణీయమైన మాటలు చెప్పి, అనంతరం ₹650 చెల్లించేందుకు PhonePe/UPI QR స్కానర్ పంపిస్తున్నట్లు చెబుతున్నారు. ₹15 వేల అడ్వాన్స్ వస్తుందనే ఆశతో కొందరు డబ్బులు చెల్లించిన తర్వాత, మోసగాళ్లు మరిన్ని వివరాలు అడగడం లేదా వివిధ కారణాలతో ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 16:21:51
సిద్దిపేట (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
