టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.

టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టడాలు సాగుతున్న సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రధాన వీధుల గుండా రోడ్డు పక్కన నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారుల విప్లమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ  నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని పూలాo గ్ సమీపంలో గల టిటిడి కళ్యాణ మండపం ముందు నాన్ లేఅవుట్ ప్లాట్ లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమ ఇంటి నిర్మాణం పై  టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు తీసుకోకపోవడం వెనుక మామూళ్ల బాగోతం ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీనిని అడ్డుకోవాల్సిన  సంబంధిత అధికారులు ఇంటి యజమానితో బేరా సారాలు సాగించి ముడుపులు తీసుకున్నట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారుల జేబులు నింపుతున్నాయి. నిరుపేదలు నిర్మించుకుంటున్న ఇండ్లపై  నిబంధనల సాకుతో  చర్యలు తీసుకుంటున్న అధికారులు బడా బాబుల  నిర్మాణాలపై  మౌనంగా ఉండడం ఆరోపణలకు బలాన్ని చేకూరు వస్తున్నాయి. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా నోటీసులు జారీ చేశామని తప్పుడు సమాచారం అందించి ఫిర్యాదు దారులను  తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై  జిల్లా కలెక్టర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని  టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని  పలువురు కోరుతున్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన
  చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం
మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు