ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం
చోద్యం చూస్తున్న అధికారులు.
నిజామాబాద్ : వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్న ప్రయోజనమే అన్న చందంగా తయారైంది అధికారుల పనితీరు. ఏకంగా ప్రభుత్వ స్థలంలోనే ప్రైవేటు వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. గతంలో నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేసిన ప్రద్యుమ్న ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించిన ఇంటి నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఎన్ ఓ సి ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుంది. నగర నడిబొడ్డున గల నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఇంటి నిర్మాణం జరగడం దానికి అధికారులు వత్తాసు పలకడం వెనుక ఆంతర్యమేమిటో అంతు చిక్కడం లేదు. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్కు ఆనుకొని 443 సర్వే నెంబర్ లో గల స్థలంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయి. గతంలోనూ ఇదే సర్వే నంబర్ లో ఓ రిటైర్డ్ ఎస్సై తన పలుకుబడిని ఉపయోగించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా మరో వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉండగా 443 సర్వేనెంబర్ లో స్థలం పూర్తిగా ప్రభుత్వాన్నిదేనినని గత కలెక్టర్ ప్రద్యుమ్న నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించారు. దీంతో ఆ స్థలాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని కంచె ఏర్పాటు చేసింది. అప్పటి అధికారులు సైతం ఆ స్థలంలోకి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వ స్థలం అంటూ నిర్ధారించారు. కలెక్టర్ బదిలీ తర్వాత ఆ స్థలం పై కన్నేసిన ప్రైవేట్ వ్యక్తులు అధికారులను బురిడీ కొట్టించి అక్రమ నిర్మాణాలకు తెర లేపారు. దీనికి అవసరమైన అనుమతులు సైతం రెవెన్యూ అధికారులు ఇవ్వడం, తద్వారా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా రెవెన్యూ అధికారులే ఎన్వోసీ ఇవ్వడం వల్ల మేము ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పడం ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇకనైనా జిల్లా కలెక్టర్ సీరియస్ గా పరిగణించి అధికారుల చేతివాటానికి అన్యక్రాంతమవుతున్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
