మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం

డ్రగ్స్‌ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎస్పీ మహేష్ బి. గితే


రాజన్న సిరిసిల్ల జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా ఉండేలా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, యువత, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా సాగడంతో రాష్ట్ర EAGLE ఫోర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్ర స్థాయిలో రెండో స్థానానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను గంజాయి, డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని, ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News