నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్

నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్

నాగర్ కర్నూల్ : రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం లో తేది 19-08-2026 నాడు వచ్చే నెలలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ గురించి ప్రెస్ మీట్ మరియు పోలీస్ ఉన్నతాధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి రమాకాంత్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై మాట్లాడుతూ...నాగర్ కర్నూల్ జిల్లా లోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో తేదీ 12-09-2026 నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుంది అన్నారు. ఈ లోక్ అదాలత్ లో భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం తో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని , డబ్బును ఆదా చేసుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు సుఖ సంతోషాలతో జీవించవచ్చు అన్నారు. కక్షి దారులు పగలు ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకోవడం వల్ల మానవ సంబంధాలు బలపడతాయి అన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ అనేది కేసులు త్వరగా పరిష్కరించుకోవడానికి గొప్ప అవకాశం అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఏ శ్రీదేవి సెక్రెటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, శృతి దూత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, ఎన్ శ్రీనిధి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్, పోలీస్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులు, పత్రిక విలేకరులు పాల్గొన్నారు.
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News