పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సీఎంఆర్ కాలనీలో మొక్కలు నాటిన ఉపసర్పంచ్ రఫీక్
మెదక్ : పర్యావరణ పరిరక్షణ, హరితహారం కార్యక్రమంలో భాగంగా చేగుంట సీఎంఆర్ కాలనీలోని శ్రీ హనుమంతుడి దేవాలయ ప్రాంగణంలో గ్రామ ఉపసర్పంచ్ *రఫీక్* గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గుడి ప్రాంగణంలో పువ్వుల చెట్లు మొక్కలు తదితర మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడిన ఉపసర్పంచ్ రఫీక్ గారు _"గుడి ప్రాంగణాలు పచ్చగా ఉంటే భక్తులకు ప్రశాంత లభిస్తుంది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీడ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది"_ అని అన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను ఆలయ కమిటీకి అప్పగించారు.భక్తులు కూడా ఈ చొరవను హర్షించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గుడి వద్ద జరగాలని కోరారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Aug 2026 14:42:50
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
