అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ , పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని బిఎస్సి పార్టీ పక్షాలు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని బీఎస్పీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియకుండా మున్సిపాలిటీలో నోటీసు బోర్డు పై టెండర్ ప్రక్రియ ప్రకటన తెలియజేయకుండా, ఎవరి ప్రయోజనం కొరకు ఇట్టి టెండర్ ఏకపక్షంగా ఎందుకు కేటాయించారని, పార్టీ పక్షాన అడగటం జరుగుతుందన్నారు.మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏ రకంగా సదరు వ్యక్తులకు టెండర్ ఇచ్చారో తెలియజేయాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ అక్రమ టెండర్ ను వెంటనే రద్దు చేయకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయమును ముట్టడిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా బిల్డింగ్లపై ఏర్పరిచిన హోల్డింగ్ ప్రకటనల ఆదాయ వివరాలు కూడా తెలపాలని కోరారు.అందులో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మొగలిపాక శ్రీనివాస్, వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 16:39:22
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
సీపీఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆగ్రహం
