రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం

అధికారులకు లబ్ధిదారుడి ఫిర్యాదు.. న్యాయం చేయాలని వేడుకోలు

 రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం

దౌల్తాబాద్,సిద్దిపేట: రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దౌల్తాబాద్‌ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన సత్తయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. తన రేషన్‌ కార్డులో ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నప్పటికీ డీలర్ భూషణం ఇద్దరికి మాత్రమే రేషన్‌ బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రేషన్‌ డీలర్‌ భూషణం ను ప్రశ్నించగా.. ఇద్దరికే బియ్యం వస్తుందని సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. మాచిన్పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం తమకు ఎంతో ఆధారంగా ఉందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి పరిమాణంలో, పారదర్శకంగా బియ్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

ముగ్గురు సభ్యులున్నా.. ఇద్దరికే?

తన రేషన్‌ కార్డులో మొత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. అయితే గత మూడు నెలలుగా రేషన్‌ షాపు నంబర్‌ 3808001కు వెళ్లినప్పుడు తనకు ఇద్దరు సభ్యులకు మాత్రమే బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. మూడో సభ్యుడికి ఎందుకు బియ్యం ఇవ్వడం లేదని డీలర్‌ను ప్రశ్నించగా.. తమకు ఇద్దరికే బియ్యం వస్తుందని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు విచారణ జరిపి న్యాయం చేయాలిముగ్గురు సభ్యులు ఉన్న రేషన్‌ కార్డుకు ఇద్దరికి మాత్రమే బియ్యం అందుతున్న అంశంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపించాలని లబ్ధిదారుడు కోరుతున్నారు.  పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో కోతలు లేకుండా పూర్తి పరిమాణంలో పంపిణీ జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన
  చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం
మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు