కల్వకుర్తిలో హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నిరుపేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ:- వేణు గోపాల్

కల్వకుర్తిలో హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

 నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎలికట్టే గ్రామంలో కల్వకుర్తి హెల్పింగ్‌ హాండ్స్‌(మన సేవ సంస్థ) అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్‌ యాకల సుమిత్ర పాల్గొని భక్తులు, గ్రామ ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సుమిత్ర మాట్లాడుతూ.. ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని సర్పంచ్‌ యాకల సుమిత్ర అన్నారు. అన్నదానం కేవలం ఆకలి తీర్చడం మాత్రమే కాదని, ఆప్యాయతను పంచడంతో పాటు మానవత్వాన్ని చాటుకునే గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. నిరుపేదలు, వృద్ధులు, అభాగ్యులు ఆకలితో ఇబ్బందులు పడకుండా వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సంపద కంటే సేవ చేయాలనే మంచి మనసే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజం పట్ల బాధ్యతతో సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గోవర్ధన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని సుమిత్ర అన్నారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంది.
 
 
Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News