జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం
చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి: బీజేపీ
జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాలి
పరకాల RDOకు బీజేపీ నాయకుల వినతిపత్రం
హనుమకొండ : పరకాల అమరధామంలో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయకుండా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం పరకాల అమరధామంలో ఆగస్టు 15న నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు తీవ్రంగా అభ్యంతరకరమని భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ అన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో పరకాల ఎమ్మెల్యే, ఇతర అధికారులు, సిబ్బంది అంతా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తుంటే, మున్సిపల్ కమిషనర్ మాత్రం గౌరవ వందనం చేయకుండా వ్యవహరించడం జాతీయ పతాక గౌరవాన్ని కించపరిచేలా ఉందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పతాకం విషయంలో నిర్లక్ష్యం, అవమానం లేదా బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పదవిలో ఉన్న అధికారి జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, అధికారులు మౌనం వహించడం మరింత బాధ్యతారాహిత్యమవుతుందని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, చట్టం మరియు నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు *గాజుల నిరంజన్* ఆధ్వర్యంలో పరకాల RDO గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. జాతీయ పతాక గౌరవం విషయంలో రాజకీయాలకు, అధికార దర్పానికి, నిర్లక్ష్యానికి తావులేదు. జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి అతీతులు కారు” అని గాజుల నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంతీలాల్, దేవునూరి మేఘనాథ్, రాష్ట్ర నాయకులు కాచం గురు ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్* తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 17:14:47
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం...
