ఉమ్మడి పుల్కల్ రైతుల విద్యుత్ సమస్యలపై సూపరింటెండెంట్‌కు వినతిపత్రం

ఉమ్మడి పుల్కల్ రైతుల విద్యుత్ సమస్యలపై సూపరింటెండెంట్‌కు వినతిపత్రం

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ముత్తీరెడ్డి వెంకటనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా అంతరాయాలు, అవసరమైన విద్యుత్ పరికరాల కొరత తదితర సమస్యలను నాయకులు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన విద్యుత్ సూపరింటెండెంట్.. సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధిత గ్రామాలకు అవసరమైన పరికరాలను వెంటనే సమకూర్చాలని సూచించారు. పంట పొలాలు ఎండిపోకుండా విద్యుత్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారుల స్పందనతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోర్పోల్ గ్రామ ఉపసర్పంచ్ ప్రవీణ్ అప్పా, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు ప్రవీణ్ రెడ్డి, బేగరి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News