ఉప సర్పంచ్ రఫీక్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
వెల్దుర్తి మెదక్ జిల్లా 20 : భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని చేగుంట గ్రామ ఉప సర్పంచ్ రఫీక్ ఆధ్వర్యంలోనిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఉప సర్పంచ్ రఫీక్ గారు మాట్లాడుతూ _"రాజీవ్ గాంధీ గారు యువతకు, సాంకేతికతకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, కంప్యూటర్ విప్లవం, గ్రామీణాభివృద్ధి ఆయన అందించిన బహుమతులు. ఆయన ఆశయాలైన సామరస్యం, అభివృద్ధి, శాంతిని మనం ముందుకు తీసుకెళ్లాలి"అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని సద్భావన దినోత్సవం గా పాటించి దేశ ఐక్యత, సమైక్యత కోసం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
