బెల్లంపల్లి ఎస్సీ హాస్టల్‌కు తాత్కాలిక మార్పు
బెల్లంపల్లి మంచిర్యాల : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోస్ట్‌మెట్రిక్ ఎస్సీ హాస్టల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హాస్టల్ భవనం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా వారిని తాత్కాలికంగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న కోర్టు భవనంలోకి తరలించాలని నిర్ణయించారు. కోర్టు కార్యాలయం నూతన భవనానికి మారుతున్న నేపథ్యంలో ఖాళీ అవుతున్న భవనాన్ని హాస్టల్ విద్యార్థులకు తాత్కాలికంగా కేటాయించనున్నారు. విద్యార్థుల భద్రతకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్న కలెక్టర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
