భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

మహబూబ్ నగర్, :  భూత్పూర్‌లోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ జిల్లా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ పనితీరును పరిశీలించిన సీఎండీ సబ్‌స్టేషన్‌పై ఉన్న విద్యుత్‌ లోడ్‌, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్‌ సరఫరా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్‌ నుంచి ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది, ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో ఏమైనా అంతరాయాలు, వోల్టేజీ సమస్యలు ఉన్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ వినియోగం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని సీఎండీ అధికారులకు సూచించారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, సాంకేతిక సమస్యలు, లోడ్‌ వివరాలను అధికారులు సీఎండీకి వివరించారు. ఈ తనిఖీలో టీజీఎస్పీడీసీఎల్‌ ఎస్.ఈ.భీమనాయకక్ డి.ఈ చంద్ర మౌళి, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు:  ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ
గ్రామపంచాయతీ సిబ్బంది రిలే నిరాహార దీక్ష
నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించండి
ప్రధాన మురికి కాలువ లో చెత్త వేస్తే జరిమానా.
పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు