జయశంకర్ ఆశయసాధనకు కృషి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి : తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తో కలిసి కలెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన జీవితాంతం చేసిన కృషి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


