కరీంనగర్ లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్

బిల్లులు కార్పొరేషన్ చెల్లిస్తుంది

కరీంనగర్ లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్

కోటి రూపాయల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన

కరీంనగర్  :కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న దాదాపు 2 వేల వినాయక మండపాలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందుకు అయ్యే కరెంట్ బిల్లులన్నీ కార్పొరేషన్ చెల్లిస్తుందని తెలిపారు. గత మూడేళ్లుగా ఈ మండపాల కరెంట్ ఛార్జీలను బండి సంజయ్ తన సొంత నిధులతో చెల్లించారు. ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీకి రావడంతో బిల్లుల భారం కార్పొరేషన్ పైకి మారింది. భక్తియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించు కోవాలని, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.కరీంనగర్ పర్యటనలో భాగంగా 21వ డివిజన్ విద్యానగర్ లోని శ్రీరాంనగర్ కాలనీలో కోటి రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్ పైప్ లైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్, తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు, ఇందులో రూ.5 వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. 100 రోజుల్లో రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులు, స్మార్ట్ సిటీ కింద రూ.940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో కరీంనగర్ ను తెలుగు రాష్ట్రాల్లోనే మోడల్ గా నిలపాలని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు
కరీంనగర్ లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్
గంభీరావుపేట లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ, జయంతి వేడుకలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్