అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్
జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోనిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు, ప్రజా నాయకుడుఅనికొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పాపన్నగౌడ్చూ పినధైర్యసాహసాలుచిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం తాలూకా అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి వెంకటరమణ గౌడ్, నాయకులు సురేష్ గౌడ్, హరీష్ గౌడ్ మదన్ గౌడ్, బాల గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
