ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

వనపర్తి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిమితులకు లోబడి, నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్  ఆదేశించారు. బుధ వారం వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎండి ఆరా తీయగా.. గ్రామంలో మంజూరైన 34 ఇందిరమ్మ ఇళ్లకు 34 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు, ఇండ్లు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు హౌసింగ్ పీడీ వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎక్కువ ఎత్తుతో కూడిన బేస్మెంట్ నిర్మించుకోవడం,  పరిమితికి మించి స్లాబ్ సైజు పెంచుకోవడం వంటివి చేయవద్దని సూచించారు. అలా చేస్తే నిర్మాణ ఖర్చు భారీగా పెరుగుతుందని సూచించారు. కాబట్టి లబ్ధిదారులు పరిమితులకు లోబడే నిర్మాణం చేపట్టాలని తెలియజేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లబ్ధిదారులు గంధం నాగమ్మతో పాటు మరో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను సందర్శించి, పరిశీలించి వారితో నేరుగా మాట్లాడారు. నిర్మాణ వ్యయం, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తాలు, ఇనుప సామగ్రి ధరలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను ప్రభుత్వం రాయితీ ధరలకు లబ్దిదారులకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ విటోభా, ఇతర అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు