శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలుగు భాష ప్రదర్శన.

శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలుగు భాష ప్రదర్శన.

బోధన్,(నిజామాబాద్) :తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలుగు భాష ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల యాజమాన్యం, తెలుగు భాషా అధ్యాపక బృందం అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల చేతుల మీదుగా ఫ్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రారంభమైన తెలుగు భాష ప్రదర్శనలో 150 మంది విద్యార్థులచే 115 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల మొదలుకొని చందస్సు వరకు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. తెలంగాణ మాండలికం పదాలు, ఆటల ద్వారా తెలుగు అక్షరాలు, పదాల కూర్పు, సామెతలు, తెలుగు భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రదర్శించారు. తెలంగాణ తల్లి, సీత,రాముడు,లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, తెలుగు విభాగం అధిపతి శిరీష, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు